Share News

జెండాపేటలో హుండీ చోరీ

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:01 AM

టెక్కలి మండలం పాతనౌపడ పంచాయతీ జెండాపేట గ్రామంలో గ్రామదేవత ఈశ్వరమ్మతల్లి ఆలయంలో ఉన్న హుండీని శుక్రవారం రాత్రి దొంగలు పట్టుకుపోయారు.

 జెండాపేటలో హుండీ చోరీ
పొలంలో కనిపించిన హుండీ

టెక్కలి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): టెక్కలి మండలం పాతనౌపడ పంచాయతీ జెండాపేట గ్రామంలో గ్రామదేవత ఈశ్వరమ్మతల్లి ఆలయంలో ఉన్న హుండీని శుక్రవారం రాత్రి దొంగలు పట్టుకుపోయారు. రామ మందిరం ఆవరణలో ఉన్న ఆటోలో ఉన్న రెంచీలు తీసుకువెళ్లి తలుపుల తాళాలకు ఉన్ననట్లు విప్పి హుండీ పట్టుకొని దొంగ వెళ్లిపోయాడు. సమీపంలో ఉన్న పొలాల్లో తాళం, రెంచీలు, హుండీ పడివేసి ఉన్నాయి. హుండీ కొట్టి అందులో గత ఐదేళ్లుగా గ్రామస్థులు, భక్తులు వేసిన విరాళాలు సుమారు రూ.లక్ష చోరీకి గురైనట్టు స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా ఆలయంలో వెండి కిరీటం చోరీకి గురైనట్టు స్థానికులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Nov 08 , 2026 | 01:01 AM