Share News

మద్యం దుకాణంలో చోరీ

ABN , Publish Date - Jun 21 , 2026 | 11:29 PM

హిరమండలంలోని బస్టాండ్‌ వద్ద ఉన్న ఎస్‌బీ మద్యం దుకాణంలో శనివారం రాత్రి చోరీ జరిగింది.

మద్యం దుకాణంలో చోరీ

హిరమండలం, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): హిరమండలంలోని బస్టాండ్‌ వద్ద ఉన్న ఎస్‌బీ మద్యం దుకాణంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. అర్ధరాత్రి దుకాణం షట్టర్‌ పైభాగం నుంచి ఒక వ్యక్తి లోపలకి చొరబడ్డాడు. దుకాణంలో ఉన్న రూ.2.30లక్షలు దొంగతనం చేసి ఉడాయించాడు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో దుకాణం యజమాని పి.శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ సర్వేశ్వరరావు తెలిపారు.

Updated Date - Jun 21 , 2026 | 11:29 PM