రిటైర్డ్ నేవీ ఉద్యోగి ఇంట్లో చోరీ
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:43 PM
కాకుళంలోని పీఎన్ కాలనీ రెండో లైన్‌లో నివాసముంటు న్న రిటైర్డ్ నేవీ ఉద్యోగి ఏవీ రత్నం ఇంట్లో చోరీ ఘటన కాలనీవాసుల్లో కలకలం రేపింది.
శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 9 (ఆం ధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీ రెండో లైన్‌లో నివాసముంటు న్న రిటైర్డ్ నేవీ ఉద్యోగి ఏవీ రత్నం ఇంట్లో చోరీ ఘటన కాలనీవాసుల్లో కలకలం రేపింది. స్థానికులు, బాధిత బంధువుల కథనం మేరకు.. రిటైర్డ్ నేవీ ఉద్యోగి ఏవీరత్నం, భార్య రాధిక జనవరి 24న బెంగళూరులో ఉన్న కుమారుడి వద్దకు వెళ్లారు. అయితే సోమవారం ఏవీరత్నం నివసిస్తున్న ఇంటి పక్కన సందులో ఉన్న కిటికీ తలుపు ఊచలు విరగ్గొట్టి ఉండడాన్ని స్థానికులు గమనించి వారికి ఫోన్‌లో సమాచారం అందించారు. వారు నగ రంలోని వారి బంధువులకు విషయం తెలియజేసి ఇంటికి వెళ్లి చూడాలని కోరారు. వారువచ్చి చూసి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు టూటౌన్ ఎస్‌ఐ లక్ష్మి క్యూస్‌టీం సభ్యులతో కలిసి ఘటనా స్థలానికి చేరకుని వివరాలు సేకరించారు. బెడ్‌రూమ్‌లో ఉన్న చెక్క బీరువా పగులకొట్టి ఉన్న విషయాన్ని బాధితుడు ఏవీ రత్నానికి సమాచారం ఇచ్చారు. అయితే బీరువాలో ఉన్న బంగారంతో కట్టించిన రుద్రాక్షమాల, నల్లపూసలతాడు కలిపితే మొత్తం నాలుగు తులాల బంగా రం ఉంటుందని ఎస్‌ఐ లక్ష్మికి ఫోన్‌లో వివరించారు. వారు బెంగళూరు నుంచి వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేసిన తరువాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్టు టూటౌన్ సీఐ ఈశ్వరరావు తెలిపారు.