Share News

అమ్మవారి ఆలయంలో చోరీ

ABN , Publish Date - Nov 21 , 2026 | 11:42 PM

స్థానిక నర్సిపురం కాలనీలో కొత్తగా నిర్మించిన మజ్జిగౌరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత చోరీ జరిగింది.

 అమ్మవారి ఆలయంలో చోరీ
ఆలయ తలుపులు విరగ్గొట్టిన దృశ్యం

పలాస, నవంబరు 21 (ఆంధ్ర జ్యోతి): స్థానిక నర్సిపురం కాలనీలో కొత్తగా నిర్మించిన మజ్జిగౌరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత చోరీ జరిగింది. అమ్మవారి మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడుతో పాటు వివిధ ఆభరణాలు, వెండి, హుండీలో ఉన్న నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. శనివారం ఆలయం తెరిచేందుకు వెళ్లిన పూజారి ఇప్పిటి శంకర్‌ తాళాలు విరగ్గొట్టి ఉండడాన్ని గుర్తించి ఆలయ నిర్వాహకులకు సమాచారం అందించారు. అనంతరం వారు పరిశీలించి చోరీ జరిగినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో క్లూస్‌టీమ్‌ వచ్చి చోరీ జరిగిన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించింది. వేలి ముద్రలు సేకరించారు. ఈ మేరకు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రూ.1.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు ఇత్తడి వస్తువులు, గంట, హుండీలో ఉన్న నగదు రూ.20వేలు వరకూ దొంగతనం జరిగినట్లు అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉండగా ఈ ఆలయం నిర్మించిన నుంచి ఇప్పటి వరకూ మూడుసార్లు దొంగతనం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. రైల్వేస్టేషన్‌, పాతజాతీయ రహదారి పక్కనే ఉండడంతో చోరీకి పాల్పడిన వ్యక్తులు పరారయ్యేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ సంఘటనతో నిర్వాహకులు చందాలు పోగు చేసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - Nov 21 , 2026 | 11:42 PM