ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ
ABN , Publish Date - May 10 , 2026 | 12:25 AM
పలాస-కాశీబుగ్గ ము నిసిపాలిటీ పరిధి శ్రీనివా సనగర్‌లో నివాసం ఉంటు న్న ఉపాధ్యాయులు బనిశెట్టి హేమశంకర్ ఇంట్లో శుక్రవా రం రాత్రి చోరీ జరిగింది.
బంగారం, వెండితోపాటు రూ.40వేలు అపహరణ
పలాస, మే 9(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ ము నిసిపాలిటీ పరిధి శ్రీనివా సనగర్‌లో నివాసం ఉంటు న్న ఉపాధ్యాయులు బనిశెట్టి హేమశంకర్ ఇంట్లో శుక్రవా రం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హేమశంకర్ తన భార్య విజయలక్ష్మితో కలిసి స్వగ్రామం మందసలో జరి గిన బంధువుల వివాహానికి శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి తాళాలు వేసి వెళ్లారు. శనివారం ఉదయం ఇంటి పైన ఉన్నవారు హేమశంకర్ ఇంటి తలుపుల తాళాలు బద్దలు కొట్టి ఉండడాన్ని గుర్తించి సమాచారం ఇచ్చారు. దీంతో వారు వెంటనే ఇంటికి చేరుకుని పరిశీలించి చోరీ జరిగినట్టు గుర్తించి కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్‌ఐ నర్సింహమూర్తి క్లూస్ టీమ్‌తో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రెండు తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి సామగ్రి, రూ.40వేలు నగదు అహరించుకుపోయినట్టు గుర్తించా రు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
జీఎంఈ కాలనీలో..
జీఎంఈ కాలనీలో గురువారం రాత్రి చోరీ జరిగినట్టు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. మొగలి అర్జున్ ఇంటిలో గురువారం రాత్రి దొంగలు చొరబడి ఏడు తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి సామగ్రి అపహరించుకుపోయారు. అర్జున్ ఇంటి ఎదురుగా ఉన్న తన సోదరిడి ఇంటికి నిద్రించడానికి గురువారం రాత్రి 11 గంటల సమయంలో వెళ్లాడు. శుక్ర వారం తెల్లవారి అర్జున్ తన ఇంటికి వెళ్లేసరికి తలుపులు విరగ్గొట్టి ఉండడాన్ని గుర్తించాడు. అనంతరం బెడ్ రూములోని బీరువా విరగ్గొట్టి అందులో ఉన్న బం గారం, వెండి ఆభరణాలు దొంగలు అపహరించుకుపోవడాన్ని గుర్తించి పోలీసుల కు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న కాశీబుగ్గ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.