Share News

పంచాయతీ కార్యదర్శి ఇంట్లో చోరీ

ABN , Publish Date - May 11 , 2026 | 12:14 AM

మండల కేంద్రంలోని వేంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న నెలివాడ పంచాయతీ కార్యదర్శి డి.మల్లేశ్వరరావు ఇంట్లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.

పంచాయతీ కార్యదర్శి ఇంట్లో చోరీ

రణస్థలం, మే 10 (ఆంధజ్యోతి): మండల కేంద్రంలోని వేంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న నెలివాడ పంచాయతీ కార్యదర్శి డి.మల్లేశ్వరరావు ఇంట్లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమెను చూసేందు కు శనివారం కుటుంబ సభ్యులతో కలిసి లావేరు మండలం లక్ష్మీపురం వెళ్లారు. ఇంటి తాళం పగులగొట్టి ఉందని మల్లేశ్వరరావుకు ఇంటి సమీపంలో ఉన్నవారు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. వెంటనే అతడు వచ్చి చూసేసరికి ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. బీరువాలో ఉన్న ఐదు తులాల బంగారు ఆభరణాలు, రూ.1.20 లక్షల నగదు పోయినట్లు గుర్తించి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేఆర్‌ పురం పోలీసులు కేసు నమోదు చేశారు.

కుమార్తె అదృశ్యంపై తల్లి ఫిర్యాదు

శ్రీకాకుళం రూరల్‌, మే 10(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రూరల్‌ పరిధి సింగుపు రం పంచాయతీ మునసబుపేట గ్రామానికి చెందిన బుంగ తేజశ్వని కనిపించడం లేదని ఆమె తల్లి రాజులమ్మ ఫిర్యాదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ కె.రాము ఆదివారం తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఈనెల 7వ తేదీన మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో బంధువుల ఇళ్లలో వెతికినా కనిపించలేదని, దీంతో రాజులమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - May 11 , 2026 | 12:14 AM