Share News

ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో చోరీ

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:23 AM

నగరంలోని ఎల్‌బీఎస్‌ కాలనీలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంటిలో చోరీ ఘటన సోమవారం చోటు చేసుకుంది.

ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో చోరీ

శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): నగరంలోని ఎల్‌బీఎస్‌ కాలనీలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంటిలో చోరీ ఘటన సోమవారం చోటు చేసుకుంది. నగరం లోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఇంటిలో చొరబడి రెండు తులాల బంగారం, రూ.4 వేలు నగదును అపహరిం చినట్లు శ్రీకాకుళం వన్‌టౌన్‌ పోలీసులు గుర్తించారు. అయితే మైనర్ల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటు మైనర్‌ విద్యార్థులతో వన్‌టౌన్‌ సీఐ పైడిపునాయుడు వేర్వేరుగా మాట్లాడి పోయిన నగదు, బంగారాన్ని బాధితులకు అప్పగించినట్టు తెలుస్తోంది.

Updated Date - Feb 24 , 2026 | 12:24 AM