లెక్క తేలింది
ABN , Publish Date - Oct 28 , 2026 | 12:33 AM
95 candidates in the fray for ZPTC elections జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి లెక్క తేలింది. ఇంతవరకు అధికారపార్టీలో.. కూటమి అభ్యర్థుల పోటాపోటీ నామినే షన్లతో కాస్త విభిన్నమైన వాతావరణం ఉండగా.. మంగళవారం నాటికి ఐక్యత కుది రింది.
జడ్పీటీసీ ఎన్నికల బరిలో 95 మంది
కుదిరిన కూటమి ఐక్యత
22 స్థానాల్లో టీడీపీ పోటీ
జనసేనకు ఆరు, బీజేపీకి రెండు స్థానాలు కేటాయింపు
542 ఎంపీటీసీ స్థానాల్లో 19 ఏకగ్రీవం
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
శ్రీకాకుళం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి లెక్క తేలింది. ఇంతవరకు అధికారపార్టీలో.. కూటమి అభ్యర్థుల పోటాపోటీ నామినే షన్లతో కాస్త విభిన్నమైన వాతావరణం ఉండగా.. మంగళవారం నాటికి ఐక్యత కుది రింది. నామినేషన్ల ప్రక్రియ ముగియగా మొత్తం 30 జడ్పీటీసీ స్థానాలకు 95 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి 22 స్థానాలు, జనసేన నుంచి 6, బీజేపీ నుంచి 2 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. వైసీపీ నుంచి 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 15 మంది, సీపీఐ(ఎం) నుంచి ఐదుగురు, ఇండిపెండెంట్‌లుగా 15 మంది, సీపీఐ నుంచి ఒకరు పోటీలో ఉన్నారు. ఇక మొత్తంగా 245 నామినేషన్లు దాఖలుకాగా.. ఇందులో 35 నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరణకు గుర య్యాయి. 115 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో కూటమికి చెందిన అభ్యర్థులే అధికంగా ఉండటం విశేషం.
19 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
ఇక జిల్లాలో 542 ఎంపీటీసీ స్థానాలకు గాను... 19 ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. 523 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 1,222 మంది బరిలో నిలిచారు.
పార్టీల వారీగా అభ్యర్థుల సంఖ్య
టీడీపీ - 478
జనసేన -74
బీజేపీ - 24
వైసీపీ - 523
కాంగ్రెస్ - 12
బీఎస్పీ - 2
సీపీఐ (ఎం)- 7
ఇతరులు - 3
ఇండిపెండెంట్ - 99