దేశ భవిష్యత్‌కు యువత ఆధారం
ABN , Publish Date - Aug 12 , 2026 | 11:58 PM
దేశ భవిష్యత్‌కు యువతే ఆధారమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరి బాబు అన్నారు.
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు
శ్రీకాకుళం లీగల్, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): దేశ భవిష్యత్‌కు యువతే ఆధారమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరి బాబు అన్నారు. అంతర్జాతీయ యువ దినో త్సవం సందర్భంగా బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘మాదక ద్రవ్యాల నిర్మూలన-మంచి జీవన శైలి’ అనే అంశంపై అవగాహన సగస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడు వ్యసనాలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే వారి భవి ష్యత్ నాశనమవుతుందన్నారు. వీటికి దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలన్నారు. మొబైల్స్‌ను చదువు, ఉపాధి, స్కిల్స్ డెవలప్‌మెంట్ పనుల కోసం వినియోగించాలన్నారు. యోగా, ఆటలు ఆడటం నిత్య అవసరాలుగా మార్చుకోవా లన్నారు. కార్యక్రమంలోన్యాయవాది ఇందిరా ప్రసాద్, పి.సౌజన్య, డి.ఫల్గుణరావు, విద్యార్థులు పాల్గొన్నారు.