Share News

యువతే నవ్యాంధ్ర ప్రగతి రథసారథులు

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:05 AM

యువతే నవ్యాంధ్ర ప్రగతి రథసారధులని, వారి ఉజ్వల భవి ష్యత్‌కు కూటమి ప్రభుత్వం భరోసా గా నిలుస్తుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

యువతే నవ్యాంధ్ర ప్రగతి రథసారథులు
విద్యార్థినులతో మాట్లాడుతున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

ఎచ్చెర్ల, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): యువతే నవ్యాంధ్ర ప్రగతి రథసారధులని, వారి ఉజ్వల భవి ష్యత్‌కు కూటమి ప్రభుత్వం భరోసా గా నిలుస్తుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌ లో ఆదివారం విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా పక్కా ప్రణాళికతో జాబ్‌ క్యాలండర్‌ను అమలుచేస్తున్నట్టు చెప్పారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి లంక శ్యామలరావు, కాళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అన్నెపు భువనేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, నేతలు వావిలపల్లి రామకృష్ణ, గాలి వెంకటరెడ్డి, పైడి ముఖలింగం, మూకళ్ల భాస్కరరావు పాల్గొ న్నారు.

‘కూటమితో బీసీలకు బాసట’

రణస్థలం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): బీసీల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని, స్థానిక సంస్థల్లో మళ్లీ 34 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఆది వారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం బీసీ రిజర్వేషన్ల తోనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. తొలిసారి బీసీలకు అవకాశం కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని, దాని ని సీఎం చంద్రబాబు నాయుడు కొనసా గిస్తున్నారన్నారు.

అవినాష్‌కు పరామర్శ

ఎచ్చెర్ల, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): డీసీఎంఎస్‌ చైౖర్మన్‌ చౌదరి అవినాష్‌ను విజయనగ రం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం పరామర్శించారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని ఎస్‌ఎంపురం స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న అవినాష్‌ను ఎంపీ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయ ణమూర్తి, జడ్పీ మాజీ చైౖర్‌ పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి, టీడీపీ నేతలున్నారు.

Updated Date - Sep 28 , 2026 | 12:05 AM