చికిత్సపొందుతూ యువకుడి మృతి
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:24 AM
చిన్నకొల్లివలస ఆర్‌ఆర్ కాలనీకి చెందిన తంగి సాయికుమార్(26) శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.
ఎల్‌ఎన్ పేట, జనవరి 16(ఆంధ్రజ్యోతి): చిన్నకొల్లివలస ఆర్‌ఆర్ కాలనీకి చెందిన తంగి సాయికుమార్(26) శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం రాత్రి సాయికుమార్ మరో యువకుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తూ స్కాట్‌పేట వద్ద అలికాం-బత్తిలి ప్రధాన రోడ్డుపై నడిచి వెలుతున్న ఓ వ్యక్తిని ఢీకొ న్నాడు. ఈ ఘటనలో సాయికుమార్ తీవ్రంగా గాయప డ్డాడు. చికిత్స నిమిత్తం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆ సుపత్రికి తీసు కెళ్లగా.. శుక్రవారం మృతి చెందాడు. సాయికుమార్‌కి తల్లిదండ్రులు ఏకాశి, ముగతమ్మతోపాటు ఇద్దరు అక్కా, చెల్లెలు ఉన్నారు. సరుబుజ్జిలి ఎస్‌ఐ బి.హైమావతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
యువకుడి ఆత్మహత్య
పాతపట్నం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): దశరధపురం గ్రామానికి చెందిన అమిత్ బౌరి (18) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అమిత్ ఇంటర్ ఫెయిల్ అయి, ఇంటివద్దనే ఉంటున్నాడు. రోజూ రాత్రిపూట ఆలస్యంగా వస్తుండేవాడు. దీంతో అతడి తల్లి సుమిత్ర బౌరి మందలించింది. మనస్తాపానికి గురైన అమిత్ ఈ నెల 14న ఇంటి వెనుకాల గల వంటపాకలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. ఏఎస్‌ఐ కె.శ్రీరామ్మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు. అమిత్‌కు తండ్రి ఉమ బౌరి చెల్లెలు ఉన్నారు. పండగ రోజుల్లో యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుమకున్నాయి.
ముగ్గురికి గాయాలు
పాతపట్నం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): సీది గ్రామ కూడలి చేరువలో మహేం ద్రతనయ వంతెనపై ఎదురెదరుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేర కు.. ఈ నెల 15వ తేదీ గురువారం రాత్రి టెక్కలి గ్రామానికి చెందిన సెగిరివలస నరసింహమూర్తి తన పిన్ని కుమారుడితో ద్విచక్ర వాహనంపై సీది నుంచి వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన వారు స్థానిక సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నరసింహమూర్తి ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ కె.శ్రీరామ్మూర్తి కేసు నమోదు చేశారు.