Share News

బీసీల కోసం మాట్లాడే హక్కు వైసీపీకి లేదు

ABN , Publish Date - Oct 09 , 2026 | 11:59 PM

We will secure 34 percent reservations, even if we have to fight for it in the Supreme Court బడుగు, బలహీన వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుని, వారి రాజకీయ సాధికారతను దెబ్బతీసిన ‘గొడ్డలి పార్టీ’ వైసీపీకి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

బీసీల కోసం మాట్లాడే హక్కు వైసీపీకి లేదు
మాట్లాడుతున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు.. పక్కన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌ తదితరులు

  • గతంలో రిజర్వేషన్లు 34 నుంచి 24 శాతానికి తగ్గింపు

  • వైసీపీ కక్షతోనే 17 వేల మంది బీసీలకు దూరమైన స్థానిక పదవులు

  • సుప్రీంకోర్టులో పోరాడైనా 34 శాతం రిజర్వేషన్లు సాధిస్తాం

  • స్థానిక సంస్థలకు నిధులు రప్పించి.. త్వరలోనే ఎన్నికలు

  • కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నాయుడు

  • శ్రీకాకుళం, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీన వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుని, వారి రాజకీయ సాధికారతను దెబ్బతీసిన ‘గొడ్డలి పార్టీ’ వైసీపీకి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి ఏకపక్షంగా తగ్గించి బీసీల పొట్టగొట్టింది గత జగన్‌ ప్రభుత్వమేనని మండిపడ్డారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో కేంద్రమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రులు విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ... జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాకే రిజర్వేషన్లకు కోత పడిందన్నారు. దీంతో సుమారు 17 వేల మంది బీసీ నాయకులకు స్థానిక సంస్థల్లో రాజకీయ పదవులు దూరమయ్యారన్నారు. నాడు బీసీలకు అన్యాయం జరుగుతుంటే నోరు మెదపని వైసీపీ నేతలు.. నేడు బీసీలపై అమితమైన ప్రేమ ఉన్నట్లు నాటకాలు ఆడటం విడ్డూరంగా ఉందన్నారు.

  • 34 శాతం పునరుద్ధరణే లక్ష్యం

  • బీసీలకు తిరిగి 34శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నదే ఎన్డీయే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు. ‘ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తున్నాం. హైకోర్టులో ఆశించిన నిర్ణయం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాం. సుప్రీంకోర్టు సూచించిన విధంగా రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేతృత్వంలో ‘డెడికేటెడ్‌ కమిషన్‌’ను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా బీసీల జనాభా, సామాజిక స్థితిగతులపై వివరాలు సేకరిస్తున్నాం. బీసీలకు స్వతంత్రంగా పనిచేసే అవకాశం కల్పించడమే టీడీపీ ప్రత్యేకత. ఎర్రన్నాయుడు, రామ్మోహన్‌నాయుడుకు కేంద్రమంత్రులుగా లభించిన అవకాశాలే బీసీల పట్ల పార్టీ నిబద్ధతకు నిరద్శనమ’ని మంత్రులు తెలిపారు.

  • నిధులు రప్పించి.. ఎన్నికలు జరిపిస్తాం

  • ‘గత వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆ ఐదేళ్లపాటు మున్సిపాలిటీలు, జడ్పీ, ఎంపీపీ, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని కుంటుపరిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు నిధులు కేటాయిస్తోంది. 16వ ఆర్థిక సంఘం ద్వారా వాటికి పెద్ద మొత్తంలో నిధులందే అవకాశం ఉంది. నిబంధనలకు అనుగుణంగా డీలిమిటేషన్‌ పూర్తి చేసి వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంద’ని మంత్రులు, రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాదారపు వెంకటేష్‌, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 11:59 PM