16 నెలల్లో పనులు పూర్తి చేయాలి
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:10 AM
స్వదేశీ దర్శన్ పథకం కింద ఆదిత్య ఆలయం అభివృద్ధికి కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడి కృషితో రూ.55కోట్లు మంజూరయ్యాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఆదిత్యుని కిరణస్పర్శలో దర్శించుకునేందు శంకర్ గురువారం ఉదయం ఆదిత్యాలయానికి చేరుకున్నారు.
అరసవల్లి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): స్వదేశీ దర్శన్ పథకం కింద ఆదిత్య ఆలయం అభివృద్ధికి కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడి కృషితో రూ.55కోట్లు మంజూరయ్యాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఆదిత్యుని కిరణస్పర్శలో దర్శించుకునేందు శంకర్ గురువారం ఉదయం ఆదిత్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆయన ఆలయ అనివెట్టి మండపంలో మాట్లాడారు. 16 నెలల్లో షాపింగ్ కాంప్లెక్స్, ఆరు అంతస్తుల భవనంలో అన్నదాన సత్రం, సన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, ధ్యానమందిరం, అహ్లాదకరమైన గార్డెన్, టాయిలెట్లు, బాత్రూమ్‌ల పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఫగార, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శ్రీకూర్మం పంచాయతీ కండ్రిపేట, మత్స్యలేశం గ్రామాలకు చెందిన మత్స్యకారులకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం పంపిణీచేశారు. అనంతరం శ్రీకూర్మం పంచాయతీ మత్స్యలే శం, కె.సరిగాం, దీపావళి కూడలి నుంచిరాళ్లపేట వెళ్లే రహదారి దువ్వుపేట రహదారి నిర్మాణం పనులకు ఎమ్మెల్యే శంకర్ భూమి పూజ చేశారు.
గొండుశంకర్ కంట కన్నీరు
శ్రీకాకుళంకల్చరల్, అక్టోబరు1(ఆంధ్రజ్యోతి): ఎంపీ టీసీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి అడుగ డుగునా తాను ఎదుర్కొన్న విమర్శలను తలుచుకొని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ భావోద్వేగానికి లోనై కంటకన్నీరు పెట్టుకున్నారు. శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కాలేజీ వెనుక ఉన్న యువజన శిక్షణ సంస్థలో జిల్లా మలేరియా విభాగం ఆధ్వర్యంలో విద్యార్దులకు దోమ లనునివారించే రసాయనాలతో తయారుచేసిన లాంగ్ లాస్టింగ్ ఇన్స్‌క్టిసైట్ నెట్‌లను పంపిణీ చేసే కార్యక్ర మం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూభావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో జిల్లా మలేరియాఅధికారి సత్యనారాయణ, ప్రిన్సిపాల్ ముర ళీ బాబు,మెడికల్ ఆఫీసర్ హరినాయుడు, మలేరియా కన్సలెంట్ శ్రీకాంత్, వెంకటనాయుడు పాల్గొన్నారు.