పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:58 PM
జిల్లాలో పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధా న్యం ఇస్తూ వారి సమస్యల పరిష్కారానికి చర్య లు తీసుకుంటున్నామని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అన్నారు.
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధా న్యం ఇస్తూ వారి సమస్యల పరిష్కారానికి చర్య లు తీసుకుంటున్నామని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అన్నారు. శుక్రవారం ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమాన్ని నిర్వహించి సిబ్బంది నుంచి వినతులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తం గా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది వ్యక్తిగత, ఉద్యోగ సంబంధిత సమస్యలను నేరుగా ఎస్పీకి ఫోన్‌లో వివరించారు. వారి సమస్యలను తెలుసు కున్న ఎస్పీ తక్షణం పరిష్కారానికి చర్యలు తీసు కుంటానని భరోసా కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ గ్రీవెన్స్ ద్వారా ఉద్యోగ రీత్యా సీనియార్టీ, ప్రమోషన్లు, సరెండర్ లీవ్స్, ఇతర సెలవులు మంజూరు, వేతన బకాయిలు, ఇంక్రి మెంట్, ఆరోగ్య సమస్యలపై తెలియజేయ వచ్చన్నారు. అలాగే విధి నిర్వహణలో ఎదు రయ్యే ఇబ్బందులు, భద్రతా సమస్యలు, వ్యక్తి గత, వృత్తిరీత్యా సంబంధిత సమస్యలు విన్నవిం చుకోవచ్చని సూచించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌శాఖ కట్టుబడి ఉందన్నారు.