మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:16 AM
మత్స్య కారుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం అర్బన్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మత్స్య కారుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. కుందువాని పేట గ్రామంలో మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ ఆయిల్ కార్డుల పంపిణీ శనివారం చేపట్టారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లా డుతూ.. నియోజకవర్గం మొత్తం 303 ఇంజన్ బోట్లు ఉన్నా యని, ప్రతినెలా ఒక్కో బోటుకు 300 లీటర్ల చొప్పున డీజిల్ సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందిస్తోందన్నారు. మొదటి విడతగా పెద్దగనగళ్లపేట, పుక్కళ్లపేట, కొమరవానిపేట, మొగదాలపాడు, పేర్లవానిపేట, బందరువానిపేట తదితర గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 23 కార్డులను ఎమ్మెల్యే అందించామని మిగిలిన వారికి ఈనెలాఖరుకు ఇస్తామ న్నారు. కార్యక్రమంలో కూటమి నేత మూకళ్ల శ్రీనివాసరావు, డీపీవో స్వరూపారాణి, ఎంపీడీవో ప్రకాశరావు, డిప్యూటీ ఎంపీడీవో సూర్యనారాయణ, ఎఫ్‌డీవో ముసలి నాయుడు తదితరులు పాల్గొన్నారు.