Share News

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:38 PM

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు.

 రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పట్టాదారు పాస్‌పుస్తకాన్ని అందజేస్తున్న కూన రవికుమార్‌

ఆమదాలవలస, జూలై 3 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని కట్యాచార్యులపేటలో తహసీల్దార్‌ బి.సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీచేశారు. ఈసందర్భంగా మాట్లా డుతూ వైసీపీ హయాంలో రెవెన్యూ వ్యవస్థలో అనేక లోపాలు చోటు చేసుకున్నా యని విమర్శించారు. అప్పట్లో పంపిణీ చేసిన పాస్‌ పుస్తకాలపై ముఖ్యమంత్రి ఫోటో ముద్రించడం వల్ల రైతుల్లో అభ్రధతా భావం ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తప్పులను సరిదిద్దుతూ ప్రభుత్వ రాజముద్రతతో రైతుల పేర్లతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను అందిస్తోందన్నారు.

అర్హులందరికీ పింఛన్లు

అర్హులందరికీ పింఛన్లు అందజేయనున్నట్లు ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. శుక్రవారం మునిసిపల్‌ కార్యాలయంలో నియోజకవర్గానికి మంజూరైన 53 స్పౌజ్‌ పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీచేశారు. కార్యక్రమాల్లో మునిసిపల్‌ కమిషనర్‌ తమ్మినేని రవి, ఎంపీడీవో మెట్ట వైకుంఠరావు, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ తమ్మినేని గీతాసాగర్‌, నాగళ్ల మురళీధర్‌యాదవ్‌, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తమ్మినేని సుజాత, కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తమ్మినేని చంద్రశేఖర్‌, టీడీపీ మండలాధ్యక్షుడు నూకరాజు, దూసి సాగునీటి సంఘం అధ్యక్షుడు హనుమంతు బాలకృష్ణ, ఎంపీటీసీ అన్నెపు భాస్కరరావు, మాజీ సర్పంచ్‌లు చెల్లంనాయుడు, రమణ పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 11:39 PM