Share News

రైతు శ్రేయస్సే ధ్యేయం

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:37 PM

రైతు శ్రేయస్సే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

రైతు శ్రేయస్సే ధ్యేయం
విత్తనాల పంపిణీ

- ఎమ్మెల్యే గౌతు శిరీష

వజ్రపుకొత్తూరు, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): రైతు శ్రేయస్సే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. శనివారం వజ్రపుకొత్తూరులో రైతులకు రాయితీపై వరి విత్తనా లను ఆమె పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోద య్యే అవకాశం ఉన్నందున రైతులు వరితోపాటు ఇతర పంటలపై దృష్టిపెట్టాలన్నారు. వంశధార నీరు అందిం చే విధంగా అధికారులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుంటే వైసీపీకి అవేమి కనిపించడం లేదన్నారు. అనంతరం ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వ్యవ సాయ యంత్రాలను, సైనూరు గ్రామంలో చింతల పోలమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన వాలీబాల్‌ పోటీలను ఆమె ప్రారంభిం చారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర చైర్మన్‌ వజ్జ బాబూరావు, టీడీపీ మండల అధ్యక్షుడు పూరాడ మోహనరావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ కణితి సురేష్‌, ఎంపీడీవో ఎన్‌.రమేష్‌నాయుడు, మండల వ్యవసా యాధికారి ధనుంయరావు, ఏపీఎం ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

రైల్వే ఫ్లైఓవర్‌ పనుల పరిశీలన

కాశీబుగ్గ, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ రైల్వే ఫ్లైఓవర్‌ పనులను ఎమ్మెల్యే గౌతు శిరీష శని వారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. రూ.44కోట్లతో ఫ్లైఓవర్‌ పనులు జరుగుతు న్నాయని, ఇప్పటి వరకు 70శాతం పూర్తయ్యాయని తెలిపారు. అనుకున్న గడువు మేరకు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మాట లతో ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ వంతెనతో లక్షలాది మంది ప్రజల కష్టాలు తొలగనున్నాయని, తన కల కూడా సాకారం కానుందని అన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

పలాస, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయనిధి కింద పలు బాధిత కుటుంబాలకు రూ.6.33 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే శిరీష పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబీకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 13 , 2026 | 11:37 PM