Share News

రైతుల సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:58 PM

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. హామీ మేరకు రైతులకు రాజముద్రతో కూడిన హక్కుపత్రాలను అందజేస్తు న్నామని చెప్పారు.

 రైతుల సంక్షేమమే ధ్యేయం
పలాస రూరల్‌: మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌతు శిరీష:

పలాస రూరల్‌, ఏప్రిల్‌4 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. హామీ మేరకు రైతులకు రాజముద్రతో కూడిన హక్కుపత్రాలను అందజేస్తు న్నామని చెప్పారు. శనివారం మండలంలోని లొద్దభద్రలో 380 మంది రైతులకు భూహక్కు పత్రాల పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ పీరికట్ల విఠల్‌, టీడీపీ మండలాధ్యక్షుడు కుత్తుమ లక్ష్మణకుమార్‌, లొడగల కామేశ్వరరావు, ఎఎంసీ చైర్మన్‌ వంకల కూర్మారావు, దువ్వాడ సంతోష్‌ పాల్గొన్నారు.

జిల్లాకు పది ఎగ్‌కార్ట్‌లు

పలాస, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 10 ఎగ్‌ కార్డులు మంజూరు కాగా పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి రెండు కేంద్రాలు కేటా యించారని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శనివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డులో మెప్మా, నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ(ఎన్‌ఈసీసీ) సంయుక్తంగా ఎగ్‌కార్ట్‌ పథకాన్ని( గుడ్లు అమ్మకం కేంద్రం) ప్రారంభించారు. ముత్యాలమ్మకోనేరు రోడ్డులో మునిసిపాలిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. అలాగే మునిసిపల్‌ కార్యాలయంలో వర్మికంపోస్టు కిట్లు,తడిచెత్త-పొడిచెత్త, హానికరమైన చెత్తను వేరుచేసేందుకు డస్ట్‌బిన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో, మునిసిపల్‌ ప్రత్యే కాధికారి అప్పలరాజు, కమిషనర్‌ ఈ.శ్రీనివాసులు, టీడీపీ నాయకులు వజ్జ బాబూ రావు, లొడగల కామేశ్వరరావుయాదవ్‌, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, బడ్డ నాగరాజు, ఎం.నరేంద్ర, సప్ప నవీన్‌, యవ్వారి మోహనరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 11:58 PM