Share News

న్యాయవాదుల ఆత్మీయత మరువలేనిది

ABN , Publish Date - Jul 28 , 2026 | 11:55 PM

మూడేళ్లుగా జిల్లా న్యాయవాదులతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతిని మిగిల్చిందని, వారి ఆత్మీయతను మరువలేనిదని జిల్లా న్యాయాధికారిగా పనిచేస్తూ తూర్పు గోదావరి జిల్లాకి బదిలీ అయిన జునైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు. ఈ మేరకు జిల్లా బార్‌ అసోసియేషన్‌ హాల్లో బదిలీ వీడ్కోలు సభను నిర్వహించారు.

న్యాయవాదుల ఆత్మీయత మరువలేనిది
బదిలీపై వెళ్తున్న జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానాకు జ్ఞాపిక అందిస్తున్న బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు

బదిలీ వీడ్కోలు సభలో జిల్లా న్యాయాధికారి మౌలానా

శ్రీకాకుళం లీగల్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): మూడేళ్లుగా జిల్లా న్యాయవాదులతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతిని మిగిల్చిందని, వారి ఆత్మీయతను మరువలేనిదని జిల్లా న్యాయాధికారిగా పనిచేస్తూ తూర్పు గోదావరి జిల్లాకి బదిలీ అయిన జునైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు. ఈ మేరకు జిల్లా బార్‌ అసోసియేషన్‌ హాల్లో బదిలీ వీడ్కోలు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.రాజా రావు మాట్లాడుతూ జిల్లా న్యాయస్థానం పాలనా విషయాల్లో మంచి గుర్తింపు పొందా రన్నారు. బార్‌ అండ్‌ బెంచ్‌ సంబంధాల్లో న్యాయవాదులకు సహకారం అందించారన్నారు. అనంతరం బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఆయనకు జ్ఞాపిక అందించి అభినం దించారు. న్యాయవాదులు, ఇతర న్యాయాధి కారులతో కలిసి ఆయన టీ సేవించి వారిని పలకరించి కరచాలనం చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయాధికారులు వై. బెన్నయ్య నాయుడు, సీహెచ్‌ వివేకానంద శ్రీనివాస్‌, సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఆర్‌. శాంతిశ్రీ. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారులు కె.అనురాగ్‌, జమృత బేగం, వి.శాంతి, అసోసియేషన్‌ ప్రతిని ధులు ఈశ్వరరావు, సత్యభామ, జి.ఇందిరాప్రసాద్‌, సీనియర్‌ న్యాయవాదులు రమణ దయాల్‌, ఎన్ని సూర్యారావు కె.సుభాష్‌, కిల్లి శ్రీరామూర్తి, పేరూరి నాగేశ్వరరావు, సీర శంకరరావు, పీపీ కింజరాపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2026 | 11:55 PM