ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి
ABN , Publish Date - May 21 , 2026 | 11:18 PM
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని శ్రీకాకుళం ఇన్‌చార్జి ఆర్డీవో టి.వేణుగోపాల్ కోరారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, మే 21(ఆంధ్రజ్యోతి): ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని శ్రీకాకుళం ఇన్‌చార్జి ఆర్డీవో టి.వేణుగోపాల్ కోరారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియకు అందరూ తమ విలువైన సూచనలు, సలహాలు అందించి సహకరించాలన్నారు. నియోజకవర్గంలో 2,75,845 మంది ఓటర్లు ఉండగా 1,74,736 మందికి మ్యాపింగ్ చేశామని తెలిపారు. ప్రతి పోలింగ్‌స్టేషన్‌కు బూత్‌లెవెల్ ఏజెంట్లను రాజకీయ పార్టీలు నియమించి, జాబితాలను ఈనెల 30లోగా ఇవ్వాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్లు గణపతిరావు, చక్రవర్తి, జానకి, డీటీ జీకే శ్రీనివాసరావు, బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ, జనసేన ప్రతినిధులు భూషణరావు, ఈశ్వరి, మురళీధర్, శ్రీనివాసరావు, రాధాకృష్ణ, భాస్కరరావు పాల్గొన్నారు..