గ్రామదేవత ఉత్సవాలు చూసేందుకు వచ్చి..
ABN , Publish Date - May 14 , 2026 | 12:40 AM
గ్రామదేవత ఉత్సవాల్లో ఏర్పాటు చేసి స్టేజ్ ప్రొగ్రాం చూసేందుకు వచ్చిన ఓ యువకుడు కారు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది.
కారు ఢీకొని యువకుడు మృతి
వజ్రపుకొత్తూరు, మే 13(ఆంధ్రజ్యోతి): గ్రామదేవత ఉత్సవాల్లో ఏర్పాటు చేసి స్టేజ్ ప్రొగ్రాం చూసేందుకు వచ్చిన ఓ యువకుడు కారు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దేవునల్తాడ గ్రామంలో మూడురోజులుగా గ్రామదేవత ఉత్సవా లు జరుగుతున్నాయి. చివరి రోజు మంగళవారం గ్రామంలో జరుగుతున్న ఉత్స వాల్లో పాల్గొని అదేరోజు రాత్రి జరిగిన టీవీ కళాకారుల కామెడీ షోను చూసేం దుకు సారవకోట మండలం సవరబెజ్జి గ్రామానికి చెందిన చౌదరి సింహాచలం (21) తన మిత్రులతో కలిసి వచ్చాడు. పొగ్రాం అయిన తరువాత గ్రామంలోగల బీచ్ వద్ద ఉన్న సిమెంటు రోడ్డుపై నిద్రపోయాడు. ఇదే ప్రోగ్రాంకి వచ్చిన రెల్ల ఆనందరావు బుధవారం ఉదయం తన కారును అతివేగంగా నడుపుతూ సీసీ రోడ్డుపై నిద్రిస్తున్న చౌదరి సింహాచలంను ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ వైకుంఠరావు చెప్పారు.