వందేమాతర గీతం.. దేశభక్తికి నిదర్శనం
ABN , Publish Date - Jun 26 , 2026 | 11:38 PM
స్వాతంత్ర్యోద్యమ సమయంలో వందేమాతర గీతం దేశభక్తి స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిందని పలువురు వక్తలు అన్నారు.
బంకించంద్ర ఛటర్జీ జయంత్యుత్సవంలో వక్తలు
శ్రీకాకుళం లీగల్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్ర్యోద్యమ సమయంలో వందేమాతర గీతం దేశభక్తి స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిందని పలువురు వక్తలు అన్నారు. వందే మాతర గీత రచయిత బంకించద్ర ఛటర్జీ 188వ జయంతిని శుక్రవారం స్థానిక గాంధీ స్మారక మందిరం పార్కులు నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ గీతం ప్రజల్లో దేశభక్తిని రగిల్చిన ఉదంతాలను వక్తలు వివరించారు. ప్రతీ భారతీయుడు వందేమాతర గీతాన్ని విధిగా ఆలపించాలన్నారు. కార్యక్రమం లో విగ్రహదాత నిక్కు అప్పన్న, స్మారక మంది రం ప్రతినిధులు జామి భీమశంకర్, శాస్త్రి, గుత్తు చిన్నారావు, రవికుమార్, మురళీధర్, పైడి హర నాథరావు, మహిబుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.