Share News

పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయం

ABN , Publish Date - Aug 01 , 2026 | 11:56 PM

పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయం
వృద్ధురాలితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. శనివారం నగరంలోని సీపన్నాయుడు పేటలో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం నిర్వహించారు. రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమా నికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేసి అవగాహన కలిగించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వెంటనే పరిష్క రించేలా సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2026 | 11:56 PM