Share News

‘బడుగు వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం’

ABN , Publish Date - Aug 21 , 2026 | 11:38 PM

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్‌ అధికార ప్రతినిధి ధర్మాన తేజకుమార్‌ తెలిపారు. పెద్దలంబ పంచాయతీ మూగుపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

‘బడుగు వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం’
జలుమూరు: పథకాలను వివరిస్తున్న టీడీపీ నాయకులు:

జలుమూరు (సారవకోట), ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్‌ అధికార ప్రతినిధి ధర్మాన తేజకుమార్‌ తెలిపారు. పెద్దలంబ పంచాయతీ మూగుపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్గానాలను రెండేళ్లలోనే శతశాతం ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందకపోతే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అందేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనిట్‌ ఇన్‌చార్జి ఇసై నాగరాజు, నాయకులు బుడితి దామోదర్‌, చిట్టిబాబు, లచ్చయ్య, డోల శ్రీను, కె.బాలకృష్ణ, గోపాల్‌, ఉర్జాన తిరుపతిరావు, నందకిశోర్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

మందసలో ‘ఇంటింటికీ టీడీపీ’

హరిపురం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): మందస మండలంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని శుక్రవారం పండగలా నిర్వహించారు. రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ భావన దుర్యోధన, క్లష్టర్‌ కోఆర్డేనేటర్‌ దాసరి తాతారావు ఆధ్వర్యంలో మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో చీపి, ఉద్దానం ప్రాంతంలోని నారాయణపురం గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటా తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించారు. ఇంకా పథకాలు అందని వారి వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సాలిన మాధవరావు, రట్టి లింగరాజు, లబ్బ రుద్రయ్య, తమిరి భాస్కరరావు, బైరిశెట్టి గున్నయ్య, మురళీ చౌదరి, బొంగు దామోదరం, నవీన్‌ యాదవ్‌, పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 11:38 PM