Share News

పాడి రైతుల అభ్యున్నతే ధ్యేయం: శిరీష

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:15 PM

పాడి రైతుల అభ్యున్నతే ప్రభుత్వం ధ్యేయమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.

పాడి రైతుల అభ్యున్నతే ధ్యేయం: శిరీష
హరిపురం: మాట్లాడుతున్న శిరీష :

హరిపురం, జనవరి22 (ఆంధ్ర జ్యోతి): పాడి రైతుల అభ్యున్నతే ప్రభుత్వం ధ్యేయమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. గురువారం మందస మండలం లోని బిన్నలగ్రామంలో పశుసంవ ర్థక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిం చిన గర్భకోశవ్యాధుల చికిత్సా శిబి రం, లేగ దూడల ప్రదర్శన కార్య క్రమాన్ని ఆమె ప్రారంభించారు. అలాగే మందస వెలుగు కార్యా లయంలో ఏపీఎం కూర్మారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ-నారీ శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ మహిళా సంఘాల సాధికారిత సాధించి అభివృద్ధి పథంలో నడవాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైౖర్మన్‌ మల్లా శ్రీనివాస్‌, ఏడీ పి.చంద్రశేఖర్‌, కళింగ కార్పొరేషన్‌ డైరక్టర్‌ బావన దుర్యోధన, దాసరి తాతారావు, వైద్యులు దువ్వాడ శ్రీకాంత్‌, కిల్లి ఉమాభారతి, రాధాకుమారి, కుప్పాయి గోపాల్‌, ఎం.నవీన్‌, సాలిన మాధవరావు, ప్రధాన మన్మఽథరావు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు సహకరించాలి

మందస, జనవరి22(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనులకు అందరూ సహకరిం చాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. మందస బ్లాక్‌ కాంప్లెక్స్‌ ఆవరణలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌, భాస్కరరావు,నాయకులు కృష్ణారావు, రట్టి లింగరాజు, జి.లక్ష్మీనారాయణ, సీఈవో శాంతయ్య, రాజాన మహేష్‌, ఎం.చంద్ర శేఖర్‌, డి.తిరుపతిరావు పాల్గొన్నారు. అలాగే మందస వెలుగు కార్యాలయంలో ఈనారిశిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడారు. కార్యక్రమంలో పీడీ పైడి కూర్మారావు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2026 | 11:15 PM