Share News

దొంగ దొరికాడు

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:05 AM

Suspect in gold jewelry theft arrested టెక్కలి, కాశీబుగ్గ పట్టణాల్లోని పలు బంగారు దుకాణాల్లో ఇటీవల చోరీలకు పాల్పడిన నిందితుడ్ని శుక్రవారం అరెస్టు చేసినట్లు టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు.

దొంగ దొరికాడు
మాట్లాడుతున్న డీఎస్పీ లక్ష్మణరావు, పోలీసుల అదుపులో నిందితుడు.

బంగారు ఆభరణాల చోరీ నిందితుడు అరెస్టు

టెక్కలి రూరల్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): టెక్కలి, కాశీబుగ్గ పట్టణాల్లోని పలు బంగారు దుకాణాల్లో ఇటీవల చోరీలకు పాల్పడిన నిందితుడ్ని శుక్రవారం అరెస్టు చేసినట్లు టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు. విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మందస మండలం భిన్నాలమదనాపురం గ్రామానికి చెందిన కొమ్మాన ఢిల్లీరావు వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన చేసిన అప్పులను తీర్చేందుకు చోరీలకు అలవాటుపడ్డాడు. దీంతో బంగారు దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ.. యజమానులను ఏమార్చి ఆభరణాలతో ఉడాయించేవాడు. టెక్కలి, కాశీబుగ్గ తదితర ప్రాంతాల్లో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలించగా.. శుక్రవారం టెక్కలి సమీపాన జగతిమెట్టలో ఢిల్లీరావు పట్టుబడ్డాడు. ఆయన వద్ద రూ.2.15 లక్షల విలువైన 45 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నాం. మరో తులం బంగారం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ బ్యాంకులో తనఖా పెట్టినట్లు గుర్తించాం. నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించారని డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు. సమావేశంలో టెక్కలి సీఐ విజయ్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 12:05 AM