Share News

దివ్యాంగ చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించాలి

ABN , Publish Date - Jul 09 , 2026 | 11:18 PM

దివ్యాంగ చిన్నారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిం చాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.

దివ్యాంగ చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించాలి
దివ్యాంగ చిన్నారుల ప్రతిభను పరిశీలిస్తున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు

శ్రీకాకుళం లీగల్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగ చిన్నారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిం చాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. స్థానిక బెహరా మనో వికాస కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఉన్న దివ్యాంగ చిన్నారుల ప్రతిభను తిలకించారు. వారు అభ్య సిస్తున్న విద్య, అందిస్తున్న ప్రత్యేక శిక్షణ,ఽ థెరపీ, కౌన్సెలింగ్‌ తదితర సేవలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగ పిల్లలకు సమా జంలో సమాన గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పిల్లల ఆడుతున్న ఆటలను, నైపుణ్యాలను పరిశీలిం చారు. వారి ప్రతిభను గమనించి అక్కడ ఉన్న సిబ్బందిని అభినందించారు. పిల్లలకు అందాల్సిన ప్రభుత్వ రాయితీలు పొందడంలో ఇబ్బందులు ఎదురైతే తమ సంస్థ ద్వారా తగిన న్యాయ సహాయం ఉచితంగా పొందవచ్చని నిర్వాహకులకు సూచించారు.

Updated Date - Jul 09 , 2026 | 11:18 PM