Share News

సిక్కోలు యువతి ప్రతిభ

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:29 AM

ఆ యువతి చదువే ప్రపంచంగా ఎంచుకుని ముందుకు సాగింది. తండ్రి పడే కష్టాన్ని చిన్నత నం నుంచి చూసి ఎలాగైనా ఉన్నతంగా జీవించా లని భావించి ఆ దిశగా అడు గులు వేసింది.

సిక్కోలు యువతి ప్రతిభ
డబ్బీరు నిఖిత

  • ఒకేసారి ఐదు ఉద్యోగాలకు ఎంపిక

అరసవల్లి, మార్చి 8(ఆంధ్రజ్యోతి): ఆ యువతి చదువే ప్రపంచంగా ఎంచుకుని ముందుకు సాగింది. తండ్రి పడే కష్టాన్ని చిన్నత నం నుంచి చూసి ఎలాగైనా ఉన్నతంగా జీవించా లని భావించి ఆ దిశగా అడు గులు వేసింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని, తనలా కష్టపడ కూడదని తండ్రి చెప్పిన మాటలే స్ఫూర్తిగా తీసుకుని వివిధ పరీక్షలకు హాజరైంది. ఆమె కష్టం ఫలించింది. తండ్రి కలలను నిజం చేస్తూ ఒకేసారి ఐదు ఉద్యోగాలకు ఎంపికై తన కుటుంబంలో ఆనందాన్ని నింపింది. శ్రీకాకుళం నగరంలోని జడ్పీ ఎదురుగా ఉన్న ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన డబ్బీరు నిఖిత ఐదు ఉద్యోగాలను ఒకేసారి ఎంపికై ఆదర్శంగా నిలిచింది. వివరాలిలా ఉన్నాయి.. హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన డబ్బీరు శివకేశవ పట్నాయక్‌, తల్లి భాగ్యలక్ష్మి కుమార్తె నిఖిత. తండ్రి మెడికల్‌ రిప్రంజెంటేటివ్‌గా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. వీరికి మరో కుమారుడు ఉన్నారు. నిఖిత ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు శ్రీకాకుళం లోనే చదువుకుంది. ఇంటర్‌ బైపీసీలో జిల్లా ప్రథమంగా నిలిచి అప్పటి సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం అందుకుంది. అనంతరం నైరా వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చరల్‌, భువనేశ్వర్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. పట్టు దలతో చదివి ఒకేసారి ఐదు బ్యాంకు ఉద్యోగాల ను సాధించింది. ఐబీపీఎస్‌ పరీక్ష ద్వారా క్లర్కు, పీవో ఉద్యోగా లకు, ఎస్‌బీఐలో క్లర్కు పోస్టుకు ఎంపికైంది. అలాగే ఎస్‌ఐసీలో ఏఏవో, ఆర్‌ఆర్‌బీలో పీవో పోస్టులకు ఇంటర్వ్యూకి ఎంపికైంది. ప్రస్తుతం కెనరాబ్యాంకులో పీవో ఉద్యోగానికి సంబంధించి శిక్షణ పొందుతోంది. ఇదిలా ఉండగా తమ కుమార్తె ఐదు పోస్టులకు ఎంపికకా వడంపై తల్లిదండ్రులు శివకేశవ పట్నాయక్‌, భాగ్యలక్ష్మి హర్షం వ్యక్తంచేశారు.

Updated Date - Mar 09 , 2026 | 12:29 AM