స్వీట్‌షాప్ యజమాని నిజాయితీ
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:21 AM
బైరి జంక్షన్ వద్ద ఓ స్వీట్‌షాప్ వద్ద బంగారు ఆభరణాలతో బ్యాగ్ మరిచి వెళ్లిన మహిళకు పోలీసుల సాయంతో ఆ షాప్ యజమాని అందించి తన నిజాయితీ చాటుకున్నారు.
శ్రీకాకుళం రూరల్. జనవరి 16(ఆంధ్రజ్యోతి): బైరి జంక్షన్ వద్ద ఓ స్వీట్‌షాప్ వద్ద బంగారు ఆభరణాలతో బ్యాగ్ మరిచి వెళ్లిన మహిళకు పోలీసుల సాయంతో ఆ షాప్ యజమాని అందించి తన నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి వెళి తే.. శుక్రవారం సాసుపల్లి హేమలత, తనభర్త చైతన్యతో కలిసి రేగిడి ఆమదాల వలస వెళ్తూ బైరి జంక్షన్‌లో ఉపేంద్ర స్వీట్‌షాప్ వద్ద స్వీట్లను కొనుగోలు చేసి, ఏడు తులాల బంగారు అభరణాలు, రూ.35 వేలు నగదుతో ఉన్న బ్యాగును మరిచి వెళ్లిపోయారు. వీటిని గమనించిన సీట్ యజమాని ఆర్.వాసుదేవరావు బ్యాగును శ్రీకాకుళం రూరల్ పోలీసు స్టేషన్‌లో అప్పగించాడు. బ్యాగు పోగొట్టు కున్న బాధితురాలు హేమలత వెతుక్కుంటూ వచ్చి పోలీసు స్టేషన్‌కు చేరుకోగా, అప్పటికే పోలీసులకు అప్పగించిన బ్యాగు హేమలతకు అప్పగించారు. నిజాయితీ నిరూపించుకున్న స్వీట్‌షాప్ యజమాని వాసుదేవరావును ఎస్‌ఐ కె.రాము, తదితరులు అభినందించారు.