14నాటికి సర్ సర్వే శతశాతం పూర్తి చేయాలి
ABN , Publish Date - Jun 27 , 2026 | 11:50 PM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా చేపడుతున్న సర్వే ప్రక్రియను జూలై 14వ తేదీలోగా శతశాతం పూర్తి చేయాలని ఈఆర్వో డి.పద్మావతి ఆదే శించారు.
ఈఆర్వో డి.పద్మావతి
ఇచ్ఛాపురం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా చేపడుతున్న సర్వే ప్రక్రియను జూలై 14వ తేదీలోగా శతశాతం పూర్తి చేయాలని ఈఆర్వో డి.పద్మావతి ఆదే శించారు. శనివారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నియోజకవర్గంలోని బీఎల్వోలు, సూపర్ వైజర్లు, ఏఈఆర్వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ ఓటరును కలిసి ఎన్యూమరేషన్ ఫారం అందజేసి అందులో వివరాలు నమోదు పూర్తి చేయించాలన్నారు. సర్ సర్వేలో రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు, బూత్ స్ధాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. సర్ సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేసేందుకు వెను కాడనన్నారు. ఓటరు జాబితాపై ఎటువంటి ఆరోపణలు వచ్చినా బీఎల్వోలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిం చారు. కార్యక్రమంలో తహసీల్దార్లు ఎన్.వెంకటరావు, కల్యాణచక్రవర్తి, రమేష్, అప్పలస్వామి, మునిసిపల్ కమిషనర్ ఎన్.రమేష్, డీటీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
29 శాతం డిజిటలైజేషన్ పూర్తి: లావణ్య
ఆమదాలవలస, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): నియోజక వర్గ స్థాయిలో చేపట్టిన సర్ సర్వే డిజిటలైజేషన్ ప్రక్రి య 29 శాతం పూర్తయిందని ఈఆర్వో లావణ్య తెలి పారు. సర్ ప్రక్రియపై శనివారం తహసీల్దార్ కార్యా లయంలో తహసీల్దార్లు, బీఎల్వోలు, సూపర్‌వైజర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు అందించి వివరాలు నమోదు చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వద్దన్నారు. సమావే శంలో ఆమదాలవలస, పొందూరు, సరు బుజ్జిలి, బూర్జ మండలాల తహసీల్దార్లు, ఎన్నికల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.