గడువులోగా ‘సర్’ ప్రక్రియను పూర్తి చేయాలి
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:08 AM
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆర్డీవో కె.సాయి ప్ర త్యూష ఆదేశించారు.
ఆర్డీవో కె.సాయి ప్రత్యూష
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 8(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆర్డీవో కె.సాయి ప్ర త్యూష ఆదేశించారు. తన కార్యా లయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధ వారం సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గం లో ఇప్పటివరకు 99.98 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని, అలాగే అందిన ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోందన్నారు. గార మండలంలో అత్యధి కంగా 73.26 శాతం, రూరల్‌లో 70 శాతం, అర్బన్ పరిధిలో 60.75 శాతం డిజిటలైజేషన్ జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించేందుకు వీలుగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు జాబితాలను అందజేశా మన్నారు. ‘సర్’ ప్రక్రియను విజయవంతం చేసేందుకు రాజకీయపార్టీల ప్రతినిధులు, బీఎల్‌ఏలు ఎన్నికల సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు గణపతి, చక్రవర్తి, జానకి, ఎన్నికల ఉప తహసీల్దారు జీకే శ్రీనివాస్, రాజకీయ పార్టీల ప్రతినిధులు జానకి(కాంగ్రెస్), వేణుగోపాల్, భూషణరావు(బీజేపీ), శంకర్ (టీడీపీ), ఐటీకుమార్, మురళీ (వైసీపీ) పాల్గొన్నారు.