Share News

కిటకిటలాడిన ఆదిత్యాలయం

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:12 AM

ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత అయిన అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయం ఆది వారం కిటకిట లాడింది. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఎండ తీవ్రత, ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో మజ్జిగ పంపిణీ, తాగునీటి కేంద్రా ల వద్ద భక్తులు గుమిగూడారు.

కిటకిటలాడిన ఆదిత్యాలయం
ప్రసాదాల కౌంటర్‌ వద్ద క్యూలైన్లలో భక్తులు

ప్రసాదాలకి ఒక్కటే కౌంటర్‌తో ఇబ్బందులు

ఆదాయం రూ.5.98లక్షలు

అరసవల్లి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత అయిన అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయం ఆది వారం కిటకిట లాడింది. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఎండ తీవ్రత, ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో మజ్జిగ పంపిణీ, తాగునీటి కేంద్రా ల వద్ద భక్తులు గుమిగూడారు. ఎండ నుంచి భక్తులకు రక్షణ కోసం టెంట్లు, రెడ్‌ కార్పెట్‌ ఏర్పా టు చేశారు. అయితే టెంట్లలో ఐస్‌క్రీం వ్యాపా రులు బండ్లను పెట్టడంతో భక్తులు ఎండలోనే రాకపోకలు సాగించాల్సి వచ్చింది. దీంతో ఇబ్బం దులు ఎదుర్కొన్నారు. ప్రసాదాల కొను గోలుకు సంబంధించి ఒక్క కౌంటర్‌ మాత్రమే ఉండడం తో భక్తులు పెద్ద ఎత్తున క్యూలైన్‌లో వేచి ఉన్నా రు. దీంతో ఉక్కపోత ఎండ వేడిమితో తీవ్ర అసౌ కర్యానికి గురయ్యారు. మరో కౌంటర్‌ ఏర్పాటు చేసి ఉంటే సౌకర్యంగా ఉండేదని భక్తులు వాపో యారు. అలాగే స్వామిని దర్శించుకుని బయ టకు వచ్చే భక్తులకు పులిహోర ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తారు. అయితే ఆదివారం ఉద యం 11.15 గంటలకే ఈ కౌంటర్‌ మూసి వేశా రు. దీంతో భక్తులకు ఉచిత ప్రసాదం అందక పోవడంతో ఆవేదనకు గురయ్యారు. ఆలయ అధి కారి సెలవులో ఉండడంతో సిబ్బంది ఇష్టారాజ్యం గా సాగిందని మరికొందరు సిబ్బందే వాపో యారు.

ఆదివారం ఆదాయం రూ.5.98 లక్షలు

ఇదిలా ఉండగా ఆదివారం ఒక్కరోజు రూ. 5,98,803 ఆదాయం లభించింది. ఇందులో టిక్కె ట్ల ద్వారా రూ.2,66,000, విరాళాలు రూ.34,798, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,40,240, అలాగే ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ద్వారా రూ.1,57,765 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Jun 15 , 2026 | 12:12 AM