లేబర్ కోడ్లను రద్దు చేయకుంటే పోరాటం ఉధృతం
ABN , Publish Date - May 22 , 2026 | 11:48 PM
కార్మికవర్గాలను యజమా నులకు బానిసలుగా చేసే నాలుగు లేబ్ రోడ్లను వెంటనే రద్దు చేయా లని, లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు హెచ్చరించారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి తేజేశ్వరరావు
శ్రీకాకుళం కలెక్టరేట్, మే 22(ఆంధ్రజ్యోతి): కార్మికవర్గాలను యజమా నులకు బానిసలుగా చేసే నాలుగు లేబ్ రోడ్లను వెంటనే రద్దు చేయా లని, లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్, సేల్స్ రిప్రజెం టేటివ్స్ యూనియన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు స్థానిక కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం రద్దుచేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని విమర్శించారు. కార్మిక సంఘాలతో చర్చించ కుండా ఏకపక్షంగా ఈ కోడ్లను తీసుకురావడం ఎంతమాత్రం సమం జసం కాదన్నారు. తక్షణం వీటిని రద్దు చేయాలని కోరారు, అనం తరం లేబర్ కోడ్ల ఉత్తర్వుల కాపీలను దహనం చేశారు. కార్యక్రమంలో ఏపీ ఎం ఎస్‌ఆర్‌యూ నాయకులు ఎల్.శ్రీకాంత్, వై.శ్రీనివాసరావు, బి.వెంకట రావు, కె.కల్యాణ్, సీహెచ్ ప్రసాద్, సీహెచ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.