నేటి తరానికి అమరజీవి పోరాటం ఆదర్శం
ABN , Publish Date - Nov 01 , 2026 | 11:50 PM
అమరజీవి పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత, విశ్రాంత ఉపాధ్యాయుడు పి.రామరాజు తెలిపారు.
పాతపట్నం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): అమరజీవి పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత, విశ్రాంత ఉపాధ్యాయుడు పి.రామరాజు తెలిపారు. ఆదివారం పాత పట్నం శాఖాగ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహిం చారు. ఈమేరకు అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర సాధనకు 58 రోజులపాటు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి ప్రాణాలర్పించిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో జీవీ రమణ, జి.రవికుమార్, అంగూరు గణప తిరావు తదితరులు పాల్గొన్నారు.