విగ్రహం పగలగొట్టి.. పొలాల్లో విసిరేసి
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:06 AM
బారువ కోటిలింగేశ్వరాలయంలో ఆవరణలో గల ఉమామహేశ్వర ఆలయంలోగల నంది విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు శనివారం పగలగొట్టి పొలాల్లో విసిరిపారేశారు.
బారువలోని ఉమామహేశ్వర ఆలయంలో నంది విగ్రహం చోరీ
సోంపేట, మార్చి 21(ఆంధ్రజ్యోతి): బారువ కోటిలింగేశ్వరాలయంలో ఆవరణలో గల ఉమామహేశ్వర ఆలయంలోగల నంది విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు శనివారం పగలగొట్టి పొలాల్లో విసిరిపారేశారు. సీఐ మంగరాజు కథనం మేరకు.. ఉమామహేశ్వర ఆలయాన్ని శనివారం ఉదయం పూజారులు తెరిచి చూడగా నంది విగ్రహం కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టారు. ఆలయం చుట్టూ పోలీసులు వెతకారు. కిలోమీటరు దూరంలోని పొలంలో విగ్రహాన్ని గుర్తించారు. అయితే ఆలయంలో విగ్రహం దొంగిలించిన తర్వాత పొలంలోకి వెళ్లి పగలగొట్టి ఉండడాన్ని గుర్తించారు. ఈమేరకు క్లూస్ టీమ్, పొలీస్ జాగిలాన్ని రప్పించి పరిశీలించారు. నంది విగ్రహంలో విలువైన రాయి ఉంటుందన్న అనుమానంతో దొంగతనానికి పాల్పడి ఉండొచ్చని, పగలగొట్టిన తర్వాత సిమెంట్ ఉండడంతో విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ మేరకు విగ్రహం పగల గొట్టడంపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు.