Share News

ప్రశాంతంగా రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:02 AM

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరిగిన రాష్ట్ర బార్‌ ఎన్నికలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగిశా యి.

ప్రశాంతంగా రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు
శ్రీకాకుళం లీగల్‌: ఓటు వేయడానికి బారులు తీరిన న్యాయవాదులు

శ్రీకాకుళం లీగల్‌, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరిగిన రాష్ట్ర బార్‌ ఎన్నికలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగిశా యి. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తంగి శివప్రసాద్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 143 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఈసారి ఎన్నికల్లో తొలిసారిగా మహిళలకు ఐదు సీట్లు రిజర్వు చేశారు. జిల్లా కేంద్రంలో 773 ఓట్లకు గాను 703 ఓట్లు పోలయ్యాయి. శ్రీకాకుళం బార్‌ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఈసారి పోటీ పడ్డారు. రాష్ట్ర బార్‌ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు కూడా పరోక్ష ప్రచారం చేశాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 23 నుంచి జరగనుందని బార్‌అసోసియేషన్‌ ప్రతినిఽధులు తెలిపారు. ఈ ఎన్నికలకు సహకరించిన వారిలో ప్రధాన కార్యదర్శి పిట్ట దామోదర్‌రావు, సీనియర్‌ న్యాయవాదులు ఎన్‌.విజయకుమార్‌, బీవీపీ సుబ్రహ్మణ్యం, సీతరాజు, ఆరంగి అప్పలరాజు, రామకృష్ణరాజు, తదితరులు ఉన్నారు.

కోటబొమ్మాళిలో..

కోటబొమ్మాళి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం స్థానిక జూనియ ర్‌ సివిల్‌ కోర్టు ఆవరణంలో ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. కోర్టు పరిధిలో 29 మంది న్యాయవా దులు తమ ఓటు హక్కును వినియో గించుకున్నారు. ఎన్నికల అధికారిగా స్థానిక బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లఖినేని శ్రీనివాస్‌, రిటర్నింగ్‌ అధికా రిగా శేషసాయి వ్యవహరించారు. పో లింగ్‌ ముగిసన తర్వాత బ్యాలెట్‌ బ్యాక్స్‌ను రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌కు కొరియర్‌ చేశారు.

పాతపట్నంలో..

పాతపట్నం, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): స్థానిక బార్‌ అసోసియేషన్‌ కార్యాల యంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గ ఎన్నికలు ఉత్సాహంగా జరిగాయి. ఈ ఎన్నికలో 33మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన పాతప ట్నం బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మద్దిల రమణ తెలిపారు.

Updated Date - Feb 14 , 2026 | 12:02 AM