అత్త పెద్దకర్మ రోజునే అల్లుడి మృతి
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:25 AM
లొద్దలపేట గ్రామానికి చెందిన యతిరాజులు సన్యాసమ్మ మృతి చెందిన 11 రోజుల నాడే అల్లుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
కుటుంబ సభ్యుల్లో విషాదం
ఆమదాలవలస, జనవరి 3(ఆంధ్రజ్యోతి): లొద్దలపేట గ్రామానికి చెందిన యతిరాజులు సన్యాసమ్మ మృతి చెందిన 11 రోజుల నాడే అల్లుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. సన్యాసమ్మ పెద్దకర్మ శనివారం నిర్వహి స్తుండగా.. ఆమె అల్లుడు గురుగుబల్లి గోవిందరావు (గోపి) అస్వస్తతకు గురై మర ణించారు. వెంటనే మృతదేహాన్ని ఆయన స్వగ్రామం పిల్లలవలస తీసుకొచ్చి దహన సంస్కారాలు చేశారు. అతడి భార్య రూపవతి, కుమారుడు షన్ముఖరావు కన్నీరు మున్నీరయ్యారు. ఇరు గ్రామాల్లోనూ విషాదఛాయలు అలముకున్నాయి.