Share News

అందివచ్చిన కొడుకు అనంత లోకాలకు...

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:46 AM

తల్లిదండ్రులకు దిక్కవుతాడనుకున్న కుమా రుడు విద్యుత్‌ షాక్‌తో మృతిచెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగి పోయింది.

 అందివచ్చిన కొడుకు అనంత లోకాలకు...
16టీకేఎల్‌1: ఈశ్వరరావు మృతదేహం

  • విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

టెక్కలి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులకు దిక్కవుతాడనుకున్న కుమా రుడు విద్యుత్‌ షాక్‌తో మృతిచెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగి పోయింది. కుమారుడి మృతదేహాన్ని పట్టుకొని ఆ తల్లిదండ్రులు లక్ష్మి, ఎర్రయ్య రోదిస్తున్న తీరు గ్రామస్థులను సైతం కండతడి పెట్టించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం బొప్పాయిపురం పంచాయతీ చల్లపేట గ్రామానికి చెందిన గురుజు ఈశ్వరరావు(19) గురువారం ఉదయం గ్రామంలో బహిర్భూమికి వెళుతూ విద్యుత్‌ వైర్లపై కాలు వేయడంతో షాక్‌కు గురై మృతిచెందాడు. అదే గ్రామంలో రోడ్డు పనులు జరుగుతుండడంతో సంబంధిత కాంట్రాక్టర్‌ మోటార్‌ కనెక్షన్ల కోసం సంబంధిత వైర్లను వదలడంతో ఈశ్వరరావు చూడకుండా కాలు వేశాడు. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఇది గమనించిన స్థానికులు హుటా హుటిన జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఈశ్వరరావు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సంఘటనపై పోలీసులు ఆరా తీశారు.

Updated Date - Jul 17 , 2026 | 12:46 AM