Share News

పారిశుధ్య కార్మికుల సేవలు భేష్‌: రవికుమార్‌

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:24 PM

పట్టణ ప్రజల ఆరోగ్యానికి సహకరిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

పారిశుధ్య కార్మికుల సేవలు భేష్‌: రవికుమార్‌
పారిశుధ్య కార్మికులకు దుస్తులు అందిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రజల ఆరోగ్యానికి సహకరిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. మునిసిపాలిటీలోని 23 వార్డు ల్లో విధుల నిర్వ హిస్తున్న పారిశుధ్య కార్మికులకు దుస్తులు, సబ్బులు, ఆయిల్‌ తదితర సామగ్రిని ఆది వారం మునిసిపల్‌ కార్యాలయంలో పంపిణీ చేశారు. కమిషనర్‌ తమ్మినేని రవి మాట్లాడుతూ.. పట్టణంలో 59 మంది పురుషులు, 21 మంది మహి ళలు పారిశుధ్య విధులు నిర్వహిస్తున్నారని, వారికి ప్రతి ఏటా వివిధ రకాల సామగ్రిని సంక్రాంతికి ముందు అందిం చడం ఆనవాయితీ అన్నారు. పట్టణ పారిశుధ్యానికి ప్రతి ఒక్కరూ సహకరిం చాలన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీతాసాగర్‌, నేతలు తంగి శంకర రావు, నాగళ్ల మురళీధర్‌ యాదవ్‌, కె.ఆంజనేయులు, బి.సూ ర్యారావు, అప్పారావు, జీడి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఎస్‌ఎంఎస్‌ యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీఎల్‌ క్రికెట్‌ టోర్నమెం ట్‌ను ఆదివారం ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ప్రారంభించారు. కళాశాల ప్రహరీ శిథిలావస్థకు చేరుకుందని, తక్షణం తగు చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర న్యాయ విభాగం కార్యదర్శి తమ్మినేని విద్యా సాగర్‌ ఎమ్మె ల్యే దృష్టికి తీసుకువెళ్లగా ప్రతిపాదనలు తయారు చేయాలని మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు.

గ్రామీణ వైద్యుల సేవలు అభినందనీయం

పొందూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్యంలో గ్రామీణ వైద్యుల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. పెనుబర్తిలో ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2026 | 11:24 PM