Share News

సర్వర్లు పనిచేయలే..

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:13 AM

అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తులు ప్రసాదాల కొను గోలుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సర్వర్లు పనిచేయలే..
ప్రసాదాల కోసం క్యూలైన్‌లో నిరీక్షిస్తున్న భక్తులు

ఆదిత్యాలయంలో ప్రసాదాల కోసం పడిగాపులు

అరసవల్లి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తులు ప్రసాదాల కొను గోలుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్వర్‌ పనిచేయక పోవడంతో టిక్కెట్ల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. దేవదాయ శాఖ ఆదేశాల మేరకు ప్రసాదాల క్రయవిక్రయాలు పూర్తిగా ఆన్‌ లైన్‌లోనే జరగాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా ప్రసాదాల కేంద్రం వద్ద మనమిత్ర క్యూఆర్‌ కోడ్‌లను ఏర్పాటు చేశారు. అయితే సర్వర్లు పనిచేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.

Updated Date - Oct 12 , 2026 | 12:14 AM