Share News

‘అమరుల త్యాగాలు మరువలేనివి’

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:42 PM

థర్మల్‌ ఉద్యమంలో అమ రులైన వీరుల త్యాగాలు మరువలే నివని పలువురు వక్తలు అన్నారు.

‘అమరుల త్యాగాలు మరువలేనివి’
అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తున్న పీపీఎస్‌ నాయకులు

సోంపేట, జూలై 14 (ఆంధ్రజ్యోతి): థర్మల్‌ ఉద్యమంలో అమ రులైన వీరుల త్యాగాలు మరువలే నివని పలువురు వక్తలు అన్నారు. థర్మల్‌ ఉద్యమంలో జరిగిన పోలీ సు కాల్పుల్లో ప్రాణాలు కోల్పో యిన వారికి మంగళవారం అమ రుల స్థూపం వద్ద నివాళి అర్పిం చారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. అమరుల త్యాగం వల్లే థర్మల్‌ పనులు నిలిచిపో యాయని, వారి త్యాగాలు నిష్ఫలం కాకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు వై.కృష్ణమూర్తి, మత్స్యకార కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సూరాడ చంద్రమోహన్‌, తమ్మినేని రామారావు, సనపల శ్రీరామ్మూర్తినాయుడు, బత్తుల శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 11:42 PM