రాజముద్రే నిజమైన రక్షణ కవచం
ABN , Publish Date - Aug 04 , 2026 | 11:01 PM
: కూటమి ప్రభుత్వం రైతులకు తమ భూములపై సర్వహక్కులు కల్పిస్తూ, రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.
-ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రైతులకు తమ భూములపై సర్వహక్కులు కల్పిస్తూ, రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మంగళవారం కిళ్లాం గ్రామంలో పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా, ప్రజాధనంతో వైసీపీ అధినేత బొమ్మను పాసు పుస్తకాలపై ముద్రించి రైతులకు పంపిణీ చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత రాజ్యాంగబద్ధంగా రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను పంపిణీ చేసి రైతుల్లో ఉన్న భయాన్ని పోగొడుతోందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. భూ పరిపాలనలో పారదర్శకతను తీసుకొచ్చి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో వంశధార డీసీ చైర్మన్ శిమ్మ చంద్రశేఖర్, మాకివలస మాజీ సర్పంచ్ యాళ్ల వేణుగోపాలరావు, కిళ్లాం గ్రామపెద్దలు బీఆర్ రామన్న, పి.సత్యనారాయణ, తహసీల్దార్ సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.