పైకప్పు పెచ్చులూడి.. గోడలు బీటలు వారి
ABN , Publish Date - Apr 06 , 2026 | 11:45 PM
జలుమూరులోని వ్యవసాయశాఖ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. 2010లో నిర్మించిన ఈ భవనం కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో కార్యాలయం పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. గోడలు సైతం బీటలు వారాయి. దీంతో ఎప్పుడు కూలిపోతుందోన్న భయాందోళనతో సిబ్బంది బిక్కుబిక్కుమని విధులు నిర్వహిస్తున్నారు.
జలుమూరు, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): జలుమూరులోని వ్యవసాయశాఖ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. 2010లో నిర్మించిన ఈ భవనం కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో కార్యాలయం పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. గోడలు సైతం బీటలు వారాయి. దీంతో ఎప్పుడు కూలిపోతుందోన్న భయాందోళనతో సిబ్బంది బిక్కుబిక్కుమని విధులు నిర్వహిస్తున్నారు. రైతులకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో జలుమూరులో వ్యవసాయ కార్యాలయంతోపాటు వ్యవసాయ పనిముట్లు ఉంచుకోడానికి గిడ్డంగి నిర్మించారు. ఈ కార్యాలయం నిర్మించి 15 ఏళ్లు దాటినా కనీసం నిర్వహణ లేకపోవ డంతో రేకులు సైతం తుప్పుపట్టిపాడవుతున్నాయి. కొండకు ఆనుకుని భవనం నిర్మించడంతో కార్యాలయంలోకి విషసర్పాలు, పురుగులు చేరుతుండడంతో సిబ్బంది, ఇక్కడకు వచ్చే వారంతా భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు స్పందించి నూతన భవనం నిర్మాణానికి నిధులు మంజూరుచేయడానికి చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.