పైకప్పు పెచ్చులూడి.. తలుపులకు చెదలు పట్టి
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:04 AM
మండలంలోని భగీరధపురం గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం భవనం ప్రమాదకరంగా మారింది. ఏళ్ల తరబడి మరమ్మ తులకు నోచుకోకపోవడంతో భవనం పైకప్పు, గోడలు పెచ్చులూడుతున్నాయి.
హిరమండలం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని భగీరధపురం గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం భవనం ప్రమాదకరంగా మారింది. ఏళ్ల తరబడి మరమ్మ తులకు నోచుకోకపోవడంతో భవనం పైకప్పు, గోడలు పెచ్చులూడుతున్నాయి. భవనం లోపలి భాగంలో తలుపులు చెదలు పట్టి పాడయ్యాయి. గదుల్లో పలుచోట్ల చెదలు పట్టడంతో సరుకులు పాడవుతాయోమోనన్న భయంతో అంగన్‌వాడీ సిబ్బం ది నిల్వచేసేందుకు భయాందోళన చెందుతున్నారు. లోపలి భాగంలో ప్లోరు కుండి పోయింది. కేంద్రం ఆవరణలో మరుగుదొడ్లు శిథిలావస్థ చేరడంతో మలవిజర్జనకు పిల్లలు, బాలింతలు ఇబ్బందిపడుతున్నారు. ఇక్కడ నీటి సదుపాయి కూడా లేదని సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భగీరధపురం అంగన్ వాడీ కేంద్రాన్ని వేరే భవనంలోకి మార్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.