రోడ్లు పాడవుతున్నాయంటూ..
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:57 PM
ఇసుక ట్రాక్టర్లు, లారీల రాకపోకలతో గ్రామంలోని రోడ్లు పాడవుతున్నాయని, దుమ్ము, ధూళితో ఇబ్బం దులు పడుతున్నామని రాగోలు గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
శ్రీకాకుళం రూరల్, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ఇసుక ట్రాక్టర్లు, లారీల రాకపోకలతో గ్రామంలోని రోడ్లు పాడవుతున్నాయని, దుమ్ము, ధూళితో ఇబ్బం దులు పడుతున్నామని రాగోలు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు బుధవారం రాత్రి దూసి రోడ్డు జంక్షన్ వద్ద రోడ్డుపై కుర్చీలు వేసుకుని మహిళలు, స్థాని కులు ఇసుక లారీలు, ట్రాక్టర్లలను అడ్డుకుని నిర సన తెలిపారు. ర్యాం పుల నుంచి రాత్రింబవళ్లు ఇసుకను తరలిస్తుం డడంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నామని, ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియడం లేదని వాపోయారు. తక్షణం అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ స్థుల నిరసనతో వాహ నాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలి గింది. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్‌ఐ కె.రాము సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, ట్రాఫిక్‌ను నియంత్రించారు.