వైసీపీ నిర్ణయాలతో రెవెన్యూ వ్యవస్థ చిన్నాభిన్నం
ABN , Publish Date - May 12 , 2026 | 12:46 AM
గత వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు, రీసర్వేలతో రెవెన్యూ వ్యవస్థని చి న్నాభిన్నం చేసిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
ప్రతి శుక్రవారం ఒక్కో నియోజకవర్గంలో ప్రజాదర్బార్
ఈ నెలాఖరులోగా అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు
జూన్ 12నుంచి కొత్తగా విడో పింఛన్లు
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
టెక్కలి, మే 11(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు, రీసర్వేలతో రెవెన్యూ వ్యవస్థని చి న్నాభిన్నం చేసిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన పాల్గొని మాట్లాడా రు. ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి రెవెన్యూ సమస్య లు పూర్తిచేయాలని సంకల్పించామని తెలిపారు. రెవెన్యూ అధికారులు నెలలో ఒక రెవెన్యూ గ్రామానికి నాలుగుసార్లు వెళ్లి అక్కడి సమస్యలు శతశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. జిల్లాలో ఎనిమిది నియోజకవ ర్గాలు ఉండగా ఒక్కో నియోజక వర్గానికి ఒక్కో శుక్రవారం క్షేత్రస్థాయిలో ప్రజాద ర్బార్ నిర్వ హిస్తామని తెలిపారు. కొత్తగా ఇళ్ల స్థలాల కోసం అర్హుల జాబితాలు సి ద్ధంగా ఉన్నాయని, ఈ నెలాఖరులోగా మంజూరు చేస్తామని తెలిపారు. జూన్ 12వ తేదీ నాటికి కొత్తగా వితంతుపింఛన్ల మంజూరుకు చ ర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీలో అనేక అక్రమాలకు పాల్ప డిందని, గుట్టలు, కొండల్లో ఇళ్లపట్టాలు ఇచ్చి చేతు లు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. ఈసారి క్షేత్ర స్థాయిలో మూడు సెంట్ల జాగాలో ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు అందిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వ హ యాంలో పలు పథకాలు లబ్ధిదారులకు ఎగ్టొట్టే దిశగా సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్స్ చేసి అర్హులకు ఇబ్బందులకు గురిచేశారని, అటువంటి సమస్యల తొలగిం చడం జరుగుతుందన్నారు. 2014-19 హయాంలో టెక్కలి లో జరిగే అభివృద్ధే తప్ప వైసీపీ నాయకులు చేసిందేమి లేదన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, డీఎస్పీ లక్ష్మణరావు, ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరి, నాయకులు ఎల్‌ఎల్ నాయుడు, పినకాన అజయ్‌కుమార్, పోలాకి చంద్రశేఖర్, పినకాన జోగారావు తదితరులు ఉన్నారు.