Share News

అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదే

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:17 AM

కూటమి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు.

అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదే
మాట్లాడుతున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

రణస్థలం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఈనెల 27 నుంచి డోర్‌ టూ డోర్‌ వెళ్లి తెలియజేయాలన్నారు. టీడీపీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అన్నారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు దూర దృష్టి నాయకత్వంలో రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీ తనంతో పరిపాలన అందిస్తున్నా రన్నారు.

కార్యక్రమంలో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు లంక శ్యామల రావు, ముప్పిడి సురేష్‌, బెండు మల్లేశ్వరరావు, కొమరాపు రవి, కళింగ కార్పొ రేషన్‌ డైరెక్టర్‌ అన్నెపు భువనేశ్వర్‌, కలిశెట్టి సూర్యనారాయణ, కనకారావు తదితరులు పాల్గొ న్నారు. అనంతరం ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - Jul 26 , 2026 | 12:17 AM