పీఏసీఎస్‌లను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే
ABN , Publish Date - Jun 16 , 2026 | 11:47 PM
రైతు సంక్షేమం కోసం పాటు పడే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్)ను కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రజలు, రైతులపై ఉందని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవి కుమార్ అన్నారు.
ఎమ్మెల్యే కూన రవికుమార్
పొందూరు, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమం కోసం పాటు పడే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్)ను కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రజలు, రైతులపై ఉందని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవి కుమార్ అన్నారు. జోగన్నపేట సమీపంలో రూ. 1.56 కోట్లతో పీఏసీఎస్ భవన నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఏసీఎస్‌లను బలోపేతం చేసి రైతులకు సంక్షేమ పథకాలను అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులు, ప్రజల ఆస్తి అయిన ఈ స్థలంలో కొంత భాగం వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమణకు గురైందని, తిరిగి ప్రజలే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోగలిగారన్నారు. 6 నెలల్లో భవన నిర్మాణం పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్య నారాయణ పీఏసీఎస్ అధ్యక్షుడు వండాన ముర ళి, డైరెక్టర్ దుంపల సత్యం, టీడీపీ మండల అధ్యక్షుడు సీహెచ్ రామ్మోహన్, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కూన సత్యనారాయణ, డీసీ సీబీ సీఈవో సత్య నారాయణ, జిల్లా ఆడిట్ ఆఫీసర్ చంటిబాబు, ఎస్‌డీఎస్‌సీవో పి.జానకి రాం, నాయకులు సీపాన శ్రీరంగ, బలగ శంకర భాస్కర్, బాడాన గిరి, ఖండాపు శ్రీను, తహసీ ల్దార్ ఆర్.వెంకటేష్, ఎంపీడీవో వాసుదేవరావు, డీసీసీబీ మేనేజర్ డి.సౌజన్య, పీఎసీఎస్ సీఈవో వై.పాపి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
‘రైతు సంక్షేమానికి ప్రాధాన్యం’
బూర్జ, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షే మానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలతో మంగళవారం రైతులకు పట్టాదారు పాస్ పుస్త కాలను పంపిణీ చేశారు. వరి విత్తనాలను రైతులకు అందించారు. రైతుల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో ప్రభు త్వం అనేక సంస్కరణలను అమలు చేస్తోంద న్నారు. రైతు లకు ఏపీఏఐఎంఎస్ యాప్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, కూటమి నాయ కులు రాంజీ, వేపారి వెంకటేష్, పీరుకట్ల సీతబాబు, రెవెన్యూ, వ్యవసాయాధికారులు, రైతులు పాల్గొన్నారు.