వృద్ధుల హక్కుల అమలు బాధ్యత ప్రభుత్వానిదే
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:56 PM
వృద్ధుల ఆస్తి, ప్రాణ రక్షణ, సంక్షే మం వంటి అంశాలతో పాటు ఎటు వంటి వేధిం పులకు అవకాశం లేకుండా పటిష్ట చర్యలు తీసు కోవాలని సీనియర్ సిటి జన్స్ అసోసియేషన్, శ్రీకాకుళం శాఖ ప్రతినిధులు కోరారు.
సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్
అరసవల్లి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): వృద్ధుల ఆస్తి, ప్రాణ రక్షణ, సంక్షే మం వంటి అంశాలతో పాటు ఎటు వంటి వేధిం పులకు అవకాశం లేకుండా పటిష్ట చర్యలు తీసు కోవాలని సీనియర్ సిటి జన్స్ అసోసియేషన్, శ్రీకాకుళం శాఖ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని సోమవారం స్థానిక ఆనంద నిలయంలో నిర్వహిం చారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ పి.జగన్మోహన రావు, పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ చౌదరి పురుషోత్తమనాయుడు మాట్లా డుతూ.. వృద్ధుల హక్కు ల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ.. 2011లో వృద్ధుల పరిరక్షణ నిమిత్తం ప్రత్యేకంగా రూపొందించిన చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల న్నారు. ఆర్టీసీ, రైల్వే, దేవాలయాల్లో వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకో వాలన్నారు. అంతకు ముందు అవగా హన ర్యాలీ, హక్కుల పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ దేవ రాజ్, సంఘం ప్రతి నిధులు సోమసుందరరావు, నరసింహారావు, మూర్తి, జోగారావు, నరసింహ పండా తదిత రులు పాల్గొన్నారు.