Share News

రథసప్తమి ఉత్సవాలను జయప్రదం చేయాలి

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:04 AM

అరసవల్లిలో ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న రథసప్తమి ఉత్స వాలను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

రథసప్తమి ఉత్సవాలను జయప్రదం చేయాలి
ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలో ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న రథసప్తమి ఉత్స వాలను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. ఈ మేరకు శనివారం రథ సప్తమి ఉత్సవ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పోస్ట ర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రచార రథం ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఈ ఏడు రోజుల ఉత్సవాల్లో ప్రజలంతా భాగ స్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఉత్సవాల చీఫ్‌ ఆఫీసర్‌ శోభా రాణి, ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌, ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ పాల్గొన్నారు.

రథసప్తమికి 10వేల వాటర్‌ బాటిళ్లు

రథసప్తమి ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళం నగరా నికి చెందిన దీపక్‌ కర్ణాని 10,000 వాటర్‌ బాటిళ్లను అందించనున్నారని ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు భక్తులకు అవసరమైన నీటిని అందించేందుకు సుమారు రూ.లక్ష విలువ చేసే 7 వాట ర్‌ డిస్పెన్సరీలను ఈవోకు అందించారు. దాత పేరున అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి జ్ఞాపికను ఈవో అందజేశారు.

ఆదిత్యుని సేవలో చాంబర్‌ ప్రతినిధులు

గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు రావడం సంతోషదాయక మని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. శనివారం నగరంలోని ఓ హోటల్‌లో ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌, ఏపీ సర్పంచ్‌ల సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచా యతీలకు కేంద్ర ప్రభుత్వం సకాలంలో నేరుగా సర్పంచ్‌ల ఖాతాల్లోకి 15 ఫైనాన్స్‌ నిధులు జమ చేసిందన్నారు. పల్లెపండుగ 1, 2 కింద నాలుగు వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం, విద్యుత్‌ లైట్లు, పారి శుధ్య పనులు, మురుగుకాలువల నిర్మాణం తదితర పనులు చేపడుతున్నారన్నారు. చాంబర్‌ ప్రతినిధులు అరసవల్లి సూర్యనారా యణ స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షు డు, మాజీ ఎమ్మెల్సీ వైవీ రాజేంద్ర ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షు డు భానోజీ నాయుడు, రాష్ట్ర ప్రతినిధి ఆనెపు రామకృష్ణ, సర్పంచ్‌లు కొంక్యాన ఆదినారాయణ, రుప్ప లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఆదిత్యుని సేవలో ఈగల్‌ ఐజీ, ఎస్పీలు

ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి ని ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ, ఈగల్‌ ఎస్పీ నగేష్‌బాబు శనివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధా నార్చకుడు ఇప్పిలి శంకర శర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకగా, అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వ దించారు. స్వామి వారి జ్ఞాపికను ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ అందజేశారు.

ఆదిత్యునికి లక్ష విరాళం

అరసవల్లి సూర్యనారాయణ స్వామికి కవిరాయని సూర్యనారాయణమూర్తి, నీలవేణి దంపతులు శని వారం రూ.లక్ష విరాళం అందించారు. తన తల్లిదం డ్రులు కామే శ్వరరావు, బాలా త్రిపురసుందరి జ్ఞాప కార్థం ఈ మొత్తం చెక్కును ఈవో కేఎన్‌వీడీవీ ప్రసా ద్‌కు అందజేశారు. వారిని అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించగా, స్వామి వారి ప్రసాదం, చిత్రపటాన్ని ఈవో అందజేశారు.

Updated Date - Jan 04 , 2026 | 12:04 AM